భారత్ కు బ్రిటన్ వార్నింగ్!
బ్రిటన్ ఆహార ప్రమాణాల నిర్ధారణ సంస్థ భారత్ మసాలా ఉత్పత్తులను వార్నింగ్ ఇచ్చింది. 2023 జనవరికి ముందునుంచి భారత్ మసాలా ఉత్పత్తుల్లో ఎథిలైన్ అక్సైడ్ ఎక్కువ ఉందని గుర్తించింది. ఇప్పటికే ఇండోనేసియా ఇరత దేశాల్లో భారత్ మసాలాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే యూరోప్ కూటమి దేశాల్లో కూడా కొన్ని భారత్ మసాలా ఉత్పత్తులపై ఆంక్షలు ప్రకటించాయి. తాజాగా బ్రిటన్ భారత మసాలా ఉత్పత్తుల్లో ఎథిలైన్ అక్సైడ్ ఎక్కువ ఉన్నందున వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. భారత్ నుంచి వచ్చే అన్ని మసాల ఉత్పత్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని బ్రిటన్ సంస్థలకు యూకె ఎఫ్ఎస్ఏ ఆదేశాలిచ్చింది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపైనా మరింతగా తనిఖీలు చేయాలని కోరింది. ఎక్కువ ఉత్పత్తుల్లో రసాయనాలు మరింతగా ఉన్నందున ఆరోగ్యానికి ప్రమాదకారులుగా గుర్తించింది. ఎండిహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంగా బ్రిటన్ సైతం ఇపుడు ఈ జాగ్రత్తలు ప్రకటించింది.






