Germany: బెర్లిన్లో ఉగాది వేడుకలు
జర్మనీ (Germany) రాజధాని బెర్లిన్ (Berlin) నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది (Ugadi) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బెర్లిన్లోని శ్రీ గణేశ్ ఆలయం (Shri Ganesh Temple ) లో నిర్వహించిన వేడుకల్లో జర్మనీ నలుమూలల నుంచి తెలంగాణ కుటుంబాలు తరలివచ్చాయి. జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు, ఇతర నేతలు బోయినపల్లి వెంకట్రమణ, భోగ అలేఖ్య, శరత్ రెడ్డి, యోగానంద్, శ్రీనాథ్, నటేష్, బాల్రాజ్ తదితరుల ఆధ్వర్యంలో సంప్రదాయసిద్దంగా వేడుకలను నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజల నిర్వహణ, పంచాంగ పఠనం జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అందరు ఉగాది పచ్చడి సేవించి, తెలంగాణ వంటలతో విందు నిర్వహించారు.






