కూలిన 2వ ప్రపంచ యుద్దం నాటి విమానం
దక్షిణ కాలిఫోర్నియాలో 2వ ప్రపంచ యుద్ధం నాటి విమానం ఒకటి ప్రమాదవశాత్తు కూలింది. చినో ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేటికే విమానం ప్రమాదానికి గురైంది. దాంతో ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రైవేట్ లాక్హిడ్ విమానం రన్వే నుండి దాదాపు 200 గజాల దూరంలో గడ్డి మైదానంలో పడిపోయింది మృతుల వివరాలను ధ్రువీకరించాల్సి వుంది. విమాన ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కాలిఫోర్నియాలోని చినోలోని యాంక్స్ ఎయిర్ మ్యూజియం ఒక ప్రటనలో తమ విమానం ఒకటి ఘోరమైన ప్రమాదంలో చిక్కుకుందని తెలిపింది. ఈ సమయంలో మేము స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి పని చేస్తున్నాము అని సదరు ప్రకటన పేర్కొంది. ప్రమాద ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేయనున్నట్లు రెండు ఏజెన్సీలు తెలిపాయి.






