Iran: ట్రంప్ చర్చలు సమస్యల పరిష్కారానికి కాదు : ఖమేనీ
అణు ఒప్పందంపై ఇరాన్(Iran)తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొనడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Khamenei) మండిపడ్డారు. ఆ చర్చలు సమస్యల పరిష్కార లక్ష్యంగా లేవని విమర్శించారు. కొన్ని ప్రభుత్వాలు, విదేశీ నాయకులు (Foreign leaders) చర్చలకు సిద్ధమేనని చెబుతున్నా, అవి బెదిరింపుల్లా ఉన్నాయి. వారి చర్చలు సమస్యల పరిష్కారం కంటే ఆధిపత్యమే లక్ష్యంగా ఉన్నాయి. ఇరాన్ను ఎదిరించలేమని తెలియడంతో చర్చలు అనే కొత్త వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు అని ఖమేనీ మండిపడ్డారు.






