Donald Trump: బీజింగ్ తో ట్రంప్ ఫ్రెండ్షిప్.. డ్రామా ఆడుతున్న పెద్దన్న

విదేశాలపై కత్తి దూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) వైఖరిలో క్రమంగా మార్పు వస్తోంది. దక్షిణాసియా దేశాలతో స్నేహం చేసేందుకు ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన కీలక ప్రకటన చేసారు. చైనా విషయంలో కాస్త సీరియస్ గా ఉన్న ట్రంప్.. తాజాగా ఆ దేశంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా, చైనా (China) అమెరికాకు అరుదైన ఖనిజాలను.. అనుకున్న దానికంటే ముందుగానే సరఫరా చేస్తుందని, చైనా విద్యార్థులకు వీసాలను కూడా అమెరికా అనుమతిస్తుందని వెల్లడించారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తమకు అవసరమైన అన్ని ఖనిజాలను చైనా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. అమెరికా యూనివర్సిటీలలో చైనా విద్యార్ధులు చదువుకోవడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. తమ దేశం కూడా చైనాకు ఎగుమతులు చేయడానికి సిద్దంగా ఉందని వెల్లడించారు. మే నెలలో సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. చైనా విషయంలో ట్రంప్ తన కఠిన వైఖరి ప్రదర్శించారు.
అయితే చైనాతో ట్రంప్ స్నేహంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాకిస్తాన్ కు చైనాకు మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. చైనా – పాకిస్తాన్ మధ్య ఎకనామిక్ కారిడార్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. పాకిస్తాన్ కు చైనా ఆయుధాలను కూడా అందిస్తోంది. ఉగ్రవాదులకు అవసరమైన సాంకేతిక పరికరాలు కూడా చైనా నుంచే తరలిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటి చైనాతో ట్రంప్ స్నేహం భారత్ పై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.