Ukraine : కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే
మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఈ విషయమై సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జెద్దాలో జరిగిన ఉన్నతాధికారుల స్థాయి చర్చల్లో ఈ దిశగా పురోగతి కన్పించింది. 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా (America) చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ సంసిద్ధత వెలిబుచ్చింది. దాంతో ఉక్రెయిన్‌కు సైనిక సాయంపై ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యా (Russia)తో చర్చించనున్నట్టు తెలిపింది.






