యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో తెలుగమ్మాయి
తెలుగమ్మాయి గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. శుక్రవారం జరిగిన డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో పోరులో గాయత్రి ద్వయం 16-21, 21-11, 21-19తో హిస్పీ షాన్- హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) పై గెలిచింది. సింగిల్స్ రెండో రౌండ్లో 8వ సీడ్ ప్రియాన్షు రజావత్ 21-18, 21-16తో హువాంగ్ (చైనీస్ తైపీ) పై నెగ్గి, క్వార్టర్స్ చేరాడు. మాళవిక బన్సోడ్ 15-21, 21-19, 21-14తో తెరెజా స్వాబికోవా (చెక్ రిపబ్లిక్) పై నెగ్గింది.






