Titanic : టైటానిక్ సర్వైవర్ లేఖ వేలం.. ధర ఎంత పలికింది అంటే?
టైటానిక్ షిప్ (Titanic ship) మునిగిపోయిన విషాదం మనకందరకూ తెలిసిందే. అయితే ఈ భారీ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజులు ముందు ఒక ప్రయాణికుడు రాసిన లేఖ ఇటీవల భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. లండన్ (London)లో నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు ఓ అభిమాని దీనిని సొంతం చేసుకున్నాడు. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు. 1912 ఏప్రిల్ 15న టైటానిక్ పడవ ప్రయాణిస్తూ ఉండగా ఒక మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్నిరోజులు ముందు కల్నల్ అర్చిబాల్డ్ గ్రేసీ (Colonel Archibald Gracie) రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌథాంపన్ట్ నుంచి రాసినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖల ఇంకా ఇది మంచి షిప్‌గా ఉన్నది. ప్రయాణం ఎలా ముగిసిందే అనుభవం చెప్పాలంటే నా ప్రయాణం ముగిసే వరకు ఎదురుచూడాలి అని రాశారు. టైటానిక్ పడవ మునిగిపోయిన ఘటనలో దాదాపు 1500 మందికి పైగా మరణించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడిన అతి తక్కువ మందిలో కల్నల్ గ్రేసీ (Colonel Gracie) ఒకరు. ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయిన 112 ఏళ్ల తర్వాత ఆయన రాసిన లేఖ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం.







