Putin: ఉగ్రపోరులో భారత్కు సంపూర్ణ మద్దతు : పుతిన్
ఉగ్రవాదంపై పోరులో భారత్ (India)కు సంపూర్ణంగా మద్దతిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్ర దాడి క్రూరమైదనని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్లో పర్యటించాలని మోదీ కోరగా పుతిన్ అంగీకరించారు. వారిద్దరి ఫోన్ సంభాషల వివరాలను రష్యా రాయబార కార్యాలయం (Russian Embassy) తోపాటు మన విదేశీ వ్యవహారాల శాఖ మీడియాకు వెల్లడించాయి. ఉగ్రవాదం (Terrorism)పై రాజీలేని పోరాటం చేయాలని, అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుద ముట్టించాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది భారత్లో నిర్వహించనున్న ద్వైపాక్షిక వార్షిక సమవేశానికి వచ్చేందుకు పుతిన్ అంగీకరించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిరచిన పుతిన్, దాడిలో అమాయక పౌరులు మరణించడం పట్ల మరోసారి సంతాపం తెలిపారు. రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ముందుకు తీసుకెళ్లాని ఇద్దరు నేతలు అనుకున్నారు.







