న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఉట్టిపడిన తెలుగుదనం
తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను భవిష్య తరాలకు చాటిచెప్పడానికి న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో వద్ద నిర్వహించిన వేడుకలు చూపరులను కట్టిపడేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల సంగీత, నృత్య కళారూపాలను ఇక్కడ ప్రదర్శించారు. కూచిపూడి నాట్యం, కళంకారీ దుస్తుల ప్రదర్శన వంటివాటికి చోటు కల్పించారు. టైమ్స్ స్క్వేర్‌లో ఇలాంటి తెలుగు సాంస్కృతిక ఉత్సవం జరగడం ఇదే తొలిసారి అని తెలుగు సాహిత్య సాంస్కృతిక సంఘం ( టీఎల్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు మాట్లాడే ప్రజల గొప్ప సంప్రదాయాలు, భాష, కళల గురించి ఈ వేడుకలు ఘనంగా చాటాయని సంస్థ అధ్యక్షుడు పర్వతాల కిరణ్‌రెడ్డి పేర్కొన్నారు.






