మాజీ రెజ్లర్ ను పెళ్లాడిన బిలియనీర్
టెక్ బిలియనీర్, బిల్ట్ రివార్డ్స్ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రైజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. మా జీవితాల్లో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. అందుకు ఎక్కువ ఖర్చు లేకుండా సాధారణంగా విహనం చేసుకున్నాం. అలంకరణల కోసం వేల డాలర్లు ఖర్చుచేయడం ఎందుకు? ప్రపంచంలోనే భిన్నమైన వాతావరణంలో పెళ్లి చేసుకోవడం కొత్త అనుభూతినిస్తోంది అని అంకుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈజిప్ట్ పిరిమిడ్ వద్ద వారి వివాహం జరిగింది.






