Zelensky :జెలెన్స్కీ పై ట్రంప్ వ్యాఖ్యలు… ఉక్రెయిన్‌కు బ్రిటన్ ప్రధాని మద్దతు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేత అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు నియంత అని, దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్టార్మర్ స్పందించారు. జెలెన్స్కీకి ఫోన్ చేశారు. తన మద్దతును తెలిపారు. ఆయన ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేత. యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించకపోవడం సరైన చర్యే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఈ విధంగానే చేసింది. ఉక్రెయిన్ శాంతిని నెలకొల్పేందుకు అమెరికా చేసే ప్రయత్నానికి మా మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో రష్యా దురాక్రమణలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటుంది అని డౌనింగ్ స్ట్రీట్ ఓ ప్రకటనలో పేర్కొంది.






