రష్యాపై మండిపడ్డ దక్షిణ కొరియా
రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై దక్షిణ కొరియా మండిపడింది. ఇది ఐరాస భద్రత మండలి తీర్మానాల ఉల్లంఘనేనని పేర్కొంది. యుద్ధాలు చేయడం, ఆక్రమణలకు పాల్పడటం వంటి చరిత్ర ఉన్న రెండు దేశాలు. ఎప్పటికీ జరగని దాడుల గురించి ముందస్తుగా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మాస్కోపై పోరాడేందుకుగాను ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల సరఫరాపైనా ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా హెచ్చరించింది. ప్యాంగాంగ్‌కు వ్యతిరేకంగా ఆంక్షల తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ఎస్సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం ఇప్పుడు అదే దేశానికి అండగా నిలవాలని తీసుకున్న నిర్ణయం. మా భద్రతకు విఘాతం కలిగిస్తుంది. అదే విధంగా మాస్కోతో మా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని సియోల్ స్పష్టం చేసింది.






