South Carolina : కరోలినాలో అత్యవసర పరిస్థితి
అమెరికాలో మరోసారి కార్చిచ్చు చెలరేగింది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా(South Carolina) రాష్ట్రాల్లో ఇది వ్యాపించింది. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలకు పొడి వాతావరణం, బలమైన గాలులు తోడవడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది (Firefighters) తీవ్రస్థాయిలో యత్నిస్తున్నారు. దక్షిణ కరోలినా రాష్ట్ర అటవీ సంరక్షణ విభాగం ప్రకారం ఇప్పటికే 4.9 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి దగ్గమైంది. దక్షిణ కరోలినాలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్ (Henry McMaster) ప్రకటించారు. కార్చిచ్చులో ప్రాణ, ఆస్తినష్టం (Property damage ) వాటిల్లలేదని అధికారులు చెప్పారు. మరోవైపు ఉత్తర కరోలినాలో నాలుగు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో రేగిన కార్చిచ్చుతో మొత్తం 161 హెక్టార్ల ప్రాంతం దగ్ఘమైనట్లు అధికారులు వివరించారు. మంటలు చెలరేగడానికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.






