అమెరికాను ఓడించిన సౌతాఫ్రికా
వరల్డ్ కప్ సూపర్-8లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. గ్రూప్-2 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగులతో అమెరికాను ఓడించింది. తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 194/4 స్కోరు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డికాక్ ( 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), స్టబ్స్ (20 నాటౌట్) రాణించారు. భారీ ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 176/6 స్కోరే చేసి ఓడింది. ఓపెనర్ గౌస్ (47 బంతుల్లో 80 నాటౌట్) చెలరేగాడు. హర్మీత్ సింగ్ (38) సత్తా చాటాడు. రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెన్డ్రిక్స్ (11) త్వరగా అవుటైనా డికాబ్ బౌలర్లను బెంబేలెత్తించారు. మార్క్రమ్ జతగా రెండో వికెట్‌కు 60 బంతుల్లోనే 110 రన్స్ ఓడించాడు. పేసర్ జస్దీప్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 28 రన్స్ రాబట్టాడు. మొత్తంగా పవర్ ప్లేను 64/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా ముగించింది. ఇక స్పిన్నర్ హర్మీత్ బౌలింగ్‌లో ఫోర్‌తో 26 బంతుల్లో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే డాకాక్ను పెవిలియన్ చేర్చిన హర్మీత్ అమెరికాకు ఊరటనిచ్చాడు. తదుపరి బంతికే మిల్లర్నూ హర్మీత్ అవుట్ చేశాడు. అర్థ శతాకానికి చేరువైన మార్క్రమ్ ఇన్నింగ్స్‌కు 15వ ఓవర్లో నేత్రావల్కర్ ముగింపు పలకగా, క్లాసెన్ స్టబ్స్ ఐదో వివేట్కు అభేద్యంగా 53 పరుగులు జత చేశారు.






