Ukraine: అమెరికా ప్రతిపాదనను అంగీకరించం
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా, క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని, ఇకపై క్రిమియా రష్యాతోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల స్పష్టం చేశారు. తాజాగా ఈ విషయంపై ఉక్రెయిన్ (Ukraine) స్పదిస్తూ అమెరికా (America) చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్కు గురిచేసిందని పేర్కొంది. క్రిమియాను తామెన్నటీకీ రష్యాలో భాగంగా గుర్తించమని, అమెరికా ప్రతిపాదనను అంగీకరించబోమని తేల్చి చెప్పింది. అమెరికా ప్రతిపాదనకు అసలు అర్థమే లేదని జెలెన్స్కీ (Zelensky) పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్ మెరోజ్ఛ్ (Oleksandr Merozch) అన్నారు. క్రిమియాను రష్యా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని, దానిని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమని పేర్కొన్నారు.







