Russia: రష్యా- అమెరికా దౌత్యవేత్తల చర్చలు
అమెరికా- రష్యా (Russia )లు శాంతి చర్చల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన కీలక దౌత్యవేత్తలు తుర్కియే (Turkey)లో భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో దౌత్య సిబ్బంది పనిచేసే వాతావరణంపై చర్చించారు. తమ దౌత్యవేత్తలకు మెరుగైన పరిస్థితులు కల్పించేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ (Sergey Lavrov) చెప్పారు. ఉక్రెయిన్ (Ukraine)ను, ఐరోపా నేతల్ని కూడా చర్చల్లో భాగస్వాముల్ని చేయాల్సిందిగా ట్రంప్‌ను కోరడానికి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) అమెరికా చేరుకున్నారు.






