ఉక్రెయిన్పై మరోసారి రష్యా భీకర దాడి
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పోల్టావాలోని ఓ విద్యా కేంద్రంపై రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడిరచారు. వీరిలో కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పరిసర నగరాలపై డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో మాస్కో సేనలు విరుచుకుపడుతున్నాయని ఉక్రెయిన్ సేనలు ఆరోపిస్తున్నాయి. వరుస పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారని చెబుతున్నాయి.






