Zelensky : పరస్పర బదిలీకి సిద్ధం… జెలెన్స్కీ ఆఫర్
రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత్తం ఖైదీల మార్పిడికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky ) ప్రకటించారు. ఉక్రెయిన్ (Ukraine)పైకి రష్యా దండయాత్ర మొదలెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్ నగరం (Kiev city ) లో జరిగిన సమవేశంలో జెలెన్స్కీ మాట్లాడారు.యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడిని ఆయన ప్రతిపాదించారు. రష్యా (Russian) జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఉక్రేనియన్లను విడుదల చేయాలి. మా జైళ్లలోని రష్యన్లకు మేం విడుదల చేస్తాం. యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దాం అని జెలెన్స్కీ అన్నారు.






