Zelensky: జెలెన్స్కీ సంచలన ప్రకటన.. నాటోలో చేర్చుకుంటే
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ను నాటో (NATO ) కూటమిలో చేర్చుకుంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్లో శాంతిని, నాటో సభ్యత్వాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. రాజధాని కీవ్ (Kiev )లో ప్రభుత్వ అధికారుల సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటో సైనిక కూటమి రక్షణ కింద ఉక్రెయిన్ (Ukraine) భద్రంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. నాటో ఛత్రచాయలో ఉక్రెయిన్లో శాశ్వతంగా శాంతియు పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. శాంతి కోసం పదవి నుంచి దిగిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఉక్రెయిన్లో శాంతిని సాధించడానికి నేను అధ్యక్ష పదవిని వదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందంటే, అందుకు సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు.






