Macron : త్వరలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమే : మేక్రాన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు ముగింపు దశకు చేరిందన్న సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సమావేశం ముగిసిన అనంతరం ఫ్రాన్స్ అధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Macron) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని వారాల్లో రష్యా(Russia ) -ఉక్రెయిన్ (Ukraine) మధ్య కాల్పులు విరమణ సాధ్యమేనని పేర్కొన్నారు. కానీ, ఇందుకోసం మాస్కో నుంచి బలమైన సెక్యూరిటీ గ్యారెంటీలు అవసరమని వెల్లడిరచారు. దీంతోపాటు చర్చల సమయంలో క్రెమ్లిన్‌తో ట్రంప్‌తో సహా మిగిలిన నేతలు మొత్తం అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.






