మీపై ప్రతిచర్యలు తప్పవు.. అమెరికాకు రష్యా హెచ్చరిక
క్రిమియాలోని సెవాస్టొపొల్ నగరంపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో అమెరికా తయారీ క్షిపణులను ఉపయోగించినట్లు నిర్ధారణ కావడంతో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశంలోని అమెరికా రాయబారి లినే ట్రాసీకి సమన్లు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు క్షిపణులను సరఫరా చేయడం ద్వారా యుద్ధంలో ఆ దేశం తరపున క్రియాశీల పక్షంగా వాషింగ్టన్ అవతరించిందంటూ మండిపడిరది. అందుకు తాము తప్పకుండా ప్రతిచర్యలు చేపడతామని హెచ్చరించింది. కీవ్‌కు అత్యాధునిక ఆయుధాలు అందజేసింది వాషింగ్టనే కాబట్టి సెవొస్టొపొల్లో దాడికి అది కూడా సమాన బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లయింది.






