ట్రంప్ పై దాడి.. అమెరికా విధానాల ఫలితమే : రష్యా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై రష్యా స్పందించింది. ఈ దాడి వెనుక ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తాము భావించడం లేదని పేర్కొంది. అమెరికా చట్ట విరుద్ధమైన విధానాలను ప్రేరేపించిన ఫలితామే ఈ దాడి అని విమర్శించింది. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని అమెరికాకు హితవు పలికిది. ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేసి, ఆ మొత్తంతో అమెరికాలో శాంతిభద్రతలను బలోపేతం చేసుకోవచ్చని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరిస్తానని ట్రంప్ పరోక్షంగా చెప్పడంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారం చేసే నాయకులను అమెరికా ప్రజలు ఎన్నుకున్నారని విమర్శించారు.






