Russia రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడిరది. ఖైదీల మార్పిడిలో భాగంగా రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ (Alexander Vinnik)ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ (Mark Fogel )ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017 లో గ్రీస్‌లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికా అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బీటీసీ-ఈ ద్వారా రాన్సమ్మేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024మేలో అంగీకరించాడు. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.






