America: అమెరికాకు చైనా, రష్యా, ఇరాన్ పిలుపు … అణు ఒప్పందంపై
అణుబాంబు నిర్మాణంలో నిమగ్నమైందన్న కారణంగా ఇరాన్‌పై అమెరికా(America) విధించిన ఆంక్షలను ఎత్తివేసి ఆ అంశంపై బహుళజాతీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభించాలని చైనా(China), రష్యా(Russia), ఇరాన్ (Iran)లు డిమాండ్ చేశాయి. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునే దిశగా సంప్రదింపులు జరిపేందుకు ముందుకు రావాలంటూ ఇరాన్ అధినేత ఆయతుల్లా అలీ ఖొమేనీకి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లేఖ రాసిన నేపథ్యంలో ఈ డిమాండ్ వెలువడిరది. అణ్వాయుధ కార్యక్రమాన్ని విరమించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు విధించారు. మరోవైపు సంప్రదింపులకు అంగీకరించాలంటూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చైనా, రష్యా, ఇరాన్‌లు సమావేశమయ్యాయి. ఇరాన్‌పై ఏకపక్షంగా అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి అని మూడు దేశాలూ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి మా జావోజు, రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ర్యాబ్కొవ్ సెర్గీ అలెక్సీన్, ఇరాన్ ఉపమంత్రి కజెమ్ ఘరీబాబాదిలు ఈ త్రిజాతీయ సమావేశంలో పాల్గొన్నారు.






