మిత్ర దేశాలతో చర్చించాకే .. ఈ నిర్ణయం : రుమేనియా
రష్యా దాడులను ఎదుర్కోవడానికి తమ పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందిస్తామని నాటో సభ్యదేశం రుమేనియా ప్రకటించింది. అన్ని అంశాలను పరిశీలించి, మిత్ర దేశాలతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా మరిన్ని చర్చలు కొనసాగించనున్నట్లు పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఒక పేట్రియాట్ వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించింది. మరొకటి సరఫరా చేసేందుక అంగీకరించింది. జర్మనీ కూడా ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థను అందించింది.






