Rohith Sharma: ఆఖరి మ్యాచ్ ఆడేస్తున్నాడా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొంతకాలంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఆటపై ఉన్న ప్రేమతో రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవాలని డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనితో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని.. అటు బోర్డు (BCCI) పెద్దలు కూడా కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్ లో లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఓపెనర్ గా మారిన తర్వాత భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇక కెప్టెన్ గా కూడా పర్వాలేదనిపించాడు రోహిత్ శర్మ. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో టెస్టు సీరిస్ ఓడిపోవడం రోహిత్ శర్మ పై ఒత్తిడి పెంచింది.
దానికి తోడు ఫామ్ కోల్పోవడం కూడా అతనిపై ఒత్తిడి పెంచుతూ వచ్చింది. దీనితో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ లో కూడా రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేదు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతను ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పి టెస్ట్ క్రికెట్ లో కొన్నాళ్లపాటు కొన్నాళ్ల సాగే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది.






