Rohith Sharma: ఇక చాలు తప్పుకో రోహిత్..!
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma).. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా ఫామ్ లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ (England) తో మొదలైన వన్డే సిరీస్ లో కూడా విఫలమయ్యాడు. మొదటి వన్డేలో రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లో నిలబడటానికి కూడా రోహిత్ ఇబ్బందులు పడ్డాడు. దీనితో అతని అభిమానులు కూడా ఇక రోహిత్ శర్మ గౌరవంగా క్రికెట్ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు.
కీలకమైన ఛాంపియన్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ అభిమానులను కంగారు పెడుతుంది. ఒకప్పుడు వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ లాడాడు. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా కూడా రోహిత్ శర్మ పేరిట రికార్డు ఉంది. అలాంటి రోహిత్ ఇప్పుడు పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ పని తీరు పెద్ద గొప్పగా ఏం లేదు. న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఆస్ట్రేలియా సిరీస్ లో ఓటమి.. రోహిత్ శర్మపై ఒత్తిడి పెంచుతున్నాయి.
దీనితో అతను అంతర్జాతీయ క్రికెట్(Cricket) నుంచి తప్పకుంటే మంచిదని అభిమానులు కూడా కోరుతున్నారు. ఇక యువకులు జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, రోహిత్ శర్మ ఉండడం పట్ల అటు బోర్డుపై కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపై రోహిత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని, లేదంటే టెస్ట్ క్రికెట్లో మాత్రమే కొనసాగాలని కొంతమంది కోరుతున్నారు. అయితే తాను కెప్టెన్ గా గానీ లేదంటే ఆటగాడిగా కానీ తప్పుకోవడానికి రోహిత్ శర్మ ఆసక్తి చూపించడం లేదు. ఇక రంజీ ట్రోఫీలో ఆడిన ఏకైక మ్యాచ్లో కూడా రోహిత్ ఇబ్బందులు పడ్డాడు.






