Rohith Sharma: ఫ్యాన్స్ కు రోహిత్ షాక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith sharma) ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్ లు బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. కేవలం 31 పరుగులు మాత్రమే చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆట తీరుపై అభిమానులు మండిపడ్డారు.
అయితే ఇంగ్లాండ్ (England) తో జరిగిన వన్డే సిరీస్ తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ కు మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్ గా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే తాజా ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీనితో అతను ఇంగ్లాండ్ తో సీరీస్ కు తప్పుకునే అవకాశాలు ఉన్నాయని.. ఐపిఎల్ తర్వాత విశ్రాంతి తీసుకుని.. ఇండియాలో క్రికెట్ సీజన్ కు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
దీనిపై జాతీయ మీడియా ఇప్పటికే పలు కథనాలు కూడా రాసింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) జట్టులో కొనసాగే అవకాశం ఉందని.. రోహిత్ శర్మ స్వయంగా తానే తప్పుకుంటాడని జాతీయ మీడియా పేర్కొంది. దీనితో ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇటీవల రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనిపై జట్టు యాజమాన్యం నమ్మకం పెరిగింది. అటు ఓపెనర్ గిల్ కూడా కెప్టెన్ రేస్ లో ఉన్నాడు. మరి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. జూన్ 20న ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. 2007 తర్వాత ఇంగ్లాండ్ లో ఇండియా టెస్ట్ సిరీస్ గెలవలేదు.






