Rohit Sharma: కెప్టెన్ వచ్చేసాడు.. మాజీ కెప్టెన్ రావాలి…!
దాదాపు ఆరు నెలల నుంచి అభిమానులు ఎదురు చూపులకు రోహిత్ శర్మ(Rohit Sharma) సమాధానం చెప్పాడు. ఇక రోహిత్ శర్మ పని అయిపోయింది.. అని కామెంట్ చేసే వాళ్లకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. కెప్టెన్ రిటైర్ అవ్వాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ.. కటక్ వన్డేలో ఆడిన ఆట తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. రోహిత్ శర్మ షాట్స్ లో మునపటి ఆట తీరుని చూసిన అభిమానులు.. రోహిత్ శర్మ పని అయిపోలేదని, ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్ము రేపాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ మ్యాచ్ లో పలు రికార్డులను కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన తర్వాత రోహిత్ పై ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో ఆడినా సరే పెద్దగా ప్రభావం చూపించలేదు. కెప్టెన్ ఇక తాజాగా చేసిన సెంచరీతో రోహిత్ శర్మ పేరు మార్మోగిపోతుంది. అయితే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రాకపోవడం మాత్రం అభిమానులను కలవరపెడుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో కేవలం ఒక్క టెస్ట్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఘోరంగా ఫెయిలయ్యాడు.
అటు రంజీ ట్రోఫీలో కూడా పెద్దగా ఆడలేదు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్లో కూడా అతను పెద్దగా ప్రభావం చూపించలేదు. దీనితో విరాట్ కోహ్లీ(Virat Kohli)పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గతంలో మాదిరిగా అతనిలో కాన్ఫిడెన్స్ కనబడటం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక మరో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆట తీరుపై కూడా అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. టాలెంట్ ఉండి కూడా సరిగ్గా ఫోకస్ పెట్టడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి.
అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా లేదంటే మూడో స్థానంలో పంపించాలని కోరుతున్నారు అభిమానులు. శుభమన్ గిల్ ను మూడో స్థానంలో పంపించి విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్ పంపాలని. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో లేదంటే ఓపెనర్ గా ఆడించాలని కోరుతున్నారు. త్వరలో ఛాంపియన్ స్టోరీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేలో ఈ మార్పు చేస్తే మంచిదని.. కొత్త బంతితో రాహుల్ ఆట తీరు బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.






