RCB: డిఫరెంట్ గా కనపడుతున్న ఆర్సీబీ
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ట్రోఫీ గెలవలేదు. ఎన్నోసార్లు ఆ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకం పెట్టుకున్నా సరే ఆ జట్టు మాత్రం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయింది. ఈ సాల కప్పు నమ్డే అంటూ.. అభిమానులను ఊరిస్తున్న బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్ లో విజేతగా నిలవలేకపోయింది. అయితే ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలని ఆర్సీబీ ధీమాగా కనపడుతుంది.
మొదటి రెండు మ్యాచ్ లలో ఆ జట్టు సాధించిన విజయాలు చూస్తున్న.. మాజీ ఆటగాళ్లు ఖచ్చితంగా ఆర్సిబి ఈసారి డిఫరెంట్ గా కనబడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో కంటే బౌలింగ్ విభాగం ఇప్పుడు చాలా పటిష్టంగా కనపడుతుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇక సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా.. పరుగులు కట్టడి చేస్తూ జట్టుకు తానంత విలువైన ఆటగాడినో చూపిస్తున్నాడు.
ఇక ఇతర బౌలర్లు కూడా కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా.. పరుగులు కట్టడి చేస్తూ ప్రత్యర్థి జట్ల కు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన చెన్నైతో మ్యాచ్ లో సుయాష్ శర్మ ఆకట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కూడా పలువురు ఆటగాళ్లు లైన్లోకి వచ్చేసారు. ఈసారి మెగా వేలం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన ఆర్సిబి.. కొంతమంది కీలక ఆటగాళ్లను పక్కనపెట్టింది. ఇక రజత్ పాటిదార్(Rajath Patidar) కెప్టెన్ గా కూడా ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ లో కూడా రజత్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. దీనితో ఈసారి ఆర్సిబి కప్పు గెలవడం ఖాయం అని అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు.






