Putin : త్వరలో భారత పర్యటనకు పుతిన్
భారత పర్యటనకు విచ్చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi ) అందించిన ఆహ్వానానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆమోదం తెలిపారు. పుతిన్ భారత పర్యటనకు అంగీకరించారని, అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ (Sergei Lavrov) ప్రకటించారు. ద్వైపాక్షిక ఎజెండా దిశగా భారత రష్యాలు అనే అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల మండలి నిర్వహించిన సదస్సులో లవ్రోవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన రష్యాకేనని గుర్తు చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ సందర్శించే వంతు మాది అని ఆయన అన్నారు. అయితే పుతిన్ ఏ తేదీన భారత్ (India)కు వస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు.






