భారత్‌లో పర్యటించనున్న పుతిన్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విసయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ వెల్లడిరచారు. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదుని, వీటిపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.అయితే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ భేటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. రష్యాలోని కజన్‌లో ఇటీవల జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ భారత్‌లో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.






