రష్యా-ఉత్తర కొరియా మధ్య ఒప్పందం
రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహాకరం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. కిమ్ ఆహ్వానం మేరకు ఉత్తర కొరియా పర్యటన నిమిత్తం పుతిన్ ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్కు చేరుకున్నారు. ఉత్తర కొరియా పరయటన అనంతరం పుతిన్ వియత్నాం చేరుకున్నారు.






