అణు దేశాలకు పుతిన్ హెచ్చరిక …మీరూ మాపై
రష్యాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకారం అందిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్లుగానే భావిస్తామని హెచ్చరించారు. రష్యా భద్రతా మండలి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ దాడులకు అణ్వాయుధాలతో సమాధానం ఇస్తారా లేదా అనే విషయాన్ని పుతిన్ స్పష్టం చేయలేదు. ఇకపై నాటో అందించిన దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగిస్తే అది రష్యా-నాటో యుద్ధంగానే పరిగణిస్తామని పుతిన్ అంటున్నారు. రష్యా అణు ముసాయిదాలో తాజా మార్పుల ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది.






