పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన మంగోలియా…ఐసీసీ వారెంట్ బేఖాతరు
రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టుకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థలో సభ్య దేశమైన మంగోలియా పట్టించుకోలేదు. తమ దేశానికి వచ్చిన పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన మంగోలియా అధ్యక్ష భవనంలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించింది. ఇంధనం, విద్యుత్తు కోసం రష్యాపై ఆధారపడుతున్న ఆ దేశం అరెస్టు వారెంట్ విషయంలో మిన్నకుండిపోయింది. 18 నెలల కిందటే పుతిన్ అరెస్టుకు ఐసీసీ వారెంట్ జారీ చేసింది. ఛంఫీుజ్ఖాన్కు నివాళులర్పించిన అనంతరం పుతిన్‌ను మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్ అధ్యక్ష భవనం లోకి తీసుకెళ్లారు. ఉలాన్ బాతర్ విద్యుత్తు కేంద్రం స్థాపన అవకాశాలపై అధ్యయనానికి సంబంధించిన ఒప్పందంపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య రైలు మార్గంపై ప్రణాళికను పుతిన్ ఆవిష్కరించారు. అక్టోబరులో జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలని ఖురేల్సుఖ్ను పుతిన్ కోరగా ఆయన అంగీకరించారు.






