అమెరికాకు పుతిన్ హెచ్చరిక
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పున ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాను హెచ్చరించారు. ఈ క్షిపణులను ఆసియా, ఐరోపాలో అగ్రరాజ్యం మోహరించిందన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్య చేశారు. స్వల్ప, మధ్యశ్రేణి అణు క్షిపణులను ధ్వంసం చేయాలని 1987లో అమెరికా, రష్యా మధ్య ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం (ఐఎన్ఎఫ్) కుదిరింది. అయితే మాస్కో దీన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ 2019లో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఈ క్షిపణి వ్యవస్థలను అమెరికా తయారు చేస్తోందని ఇప్పుడే మాకు తెలిసింది. ఒప్పందం నుంచి అమెరికా తొలగినా మేం మాత్రం వాటిని ఉత్పత్తి చేయలేదు. ఇప్పటికే డెన్మార్క్‌లో విన్యాసాల కోసం అని చెప్పి వాటిని ఐరోపాకు అమెరికా తీసుకొచ్చింది. ఇవి ఫిప్పీన్స్లోనూ ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే మేం కూడా ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేసుకోవాలని అని పుతిన్ తెలిపారు.






