Tariff : మళ్లీ మోగిన టారిఫ్ మోత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ (Tariff) మోత మోగించారు. వాహన దిగుమతుల (Imports) పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇందువల్ల దేశీయ తయారీ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. విడిభాగాలు, తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై అధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందన్నది ఒక విశ్లేషణ. ఈ సుంకం ఫలితంగా వృద్ధి మరింత పెరుగుతుందని మీడియాతో ట్రంప్ అన్నారు. ఇది శాశ్వతం అని టారిఫ్ ఆదేశాల్లో ట్రంప్ పేర్కొనడం చూస్తుంటే, ఈ నిర్ణయంపై వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 3 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ (India) నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువైన వాహన విడిభాగాల ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.






