పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో.. శాంతి సాధ్యమే : బైడెన్
పశ్చిమాసియా, ఉక్రెయిన్లలో శాంతిస్థాపన సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. న్యూయార్క్‌లో మొదలైన ఐక్యరాజ్యసమితి 79వ వార్షిక సర్వప్రతినిధి సభలో ఆయన ప్రసంగించారు. లెబనాన్ పోరు, ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో చివరిసారి ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా, దాని మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని తెలిపారు. పూర్తిస్థాయి యుద్ధం ఎవరికీ ఉపయోగకరం కాదన్నారు. హింసను ఎగదోసుకుంటూ పోవడం కంటే దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమని తెలిపారు.






