Deportation : ట్రంప్ డిపోర్టేషన్ నిర్ణయంపై పోప్ ఆగ్రహం
అక్రమ వలసదారుల డిపోర్టేషన్(Deportation)పై పోప్ ఫ్రాన్సిస్ (Francis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అక్రమ వలసదారులనే కారణంగా వారిని బలవంతంగా తరలించడం, వారిని కించపరచడమేనని, వారి గౌరవాన్ని దెబ్బతీయడమేనని, దీని ముగింపు దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, తీవ్ర పేదరికం, హింస, అభద్రత, దాడులు, వాతావరణ విపత్తుల కారణంగా సరిహద్దులు దాటి వచ్చే వారిని మాత్రం స్వాగతించాలని (Welcome), వారికి రక్షణ (Protection) కల్పించాలన్నారు. ఇందుకోసం తమ సామర్థ్యాల మేరకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. అయితే అమెరికా(America) లో కొనసాగుతున్న ఆపరేషన్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పిన పోప్(Pope), అది సరైన ఫలితం ఇవ్వదన్నారు.






