ఆ ఇద్దరూ జీవించే హక్కులను కాలరాస్తున్నారు : పోప్
అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ట్రంప్, అబార్షన్ హక్కులకు మద్దతుగా కమలా హారిస్ ఇస్తున్న హామీలపై ఆయన మండిపడ్డారు. ఆసియా పర్యటనను ముగించుకొని తిరిగి రోమ్కు వస్తున్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ శరణార్థుల పథకాలను వ్యతిరేకిస్తున్నారు. కమలా హారిస్ పిల్లలను చంపేందుకు మద్దతిస్తున్నారు. రెండు చెడ్డ హామీలతో తక్కువ చెడు స్థాయి ఉన్నదాన్ని ఎంచుకోవాలి. అది నాకు తెలియదు. వారు ఇద్దరూ జీవించే హక్కులను కాలరాస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతిక్కరూ తమ మనస్సాక్షి ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.






