Narendra Modi: ట్రంప్ అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించా : మోదీ

వాషింగ్టన్‌ను సందర్శించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)వెల్లడిరచారు. వివిధ అంశాలపై వాషింగ్టన్ (Washington)లో చర్చించుకుందామని, కలిసి లంచ్ చేద్దామని ట్రంప్ తెలిపారన్నారు. ఇటీవల జీ7 సదస్సు (G7 Summit )లో పాల్గొనేందుకు కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారని మోదీ పేర్కొన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా భువనేశ్వర్ (Bhubaneswar) లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. కెనడా నుంచి తిరిగి వెళ్లే సమయం లో అమెరికా రావాలని పిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపా. ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా నిరాకరించా. పరమపవిత్ర జగన్నాథుడు వెలసిన ఒడిశా రాష్ట్రానికి వెళ్లాల్సి ఉందని చెప్పాను. ఆ భగవంతుడిపై భక్తే నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది అని మోదీ వెల్లడిరచారు. అమెరికా వెళ్లడం కన్నా ఒడిశా సందర్శనే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.