Narendra Modi: ప్రధాని మోదీ అరుదైన ఘనత … 11 ఏళ్లలో 17సార్లు

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) సరికొత్త మైలురాయి చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు. దీనిపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఘనా, ట్రినిడాడ్-టొబాగో, నమీబియా పార్లమెంట్లలో మోదీ ప్రసంగించడంతో పాటు పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధానిగా ఉన్నపుడు విదేశీ పార్లమెంట్లలో ఏడుసార్లు ప్రసంగించారు. ఇందిరాగాంధీ (Indira Gandhi) నాలుగుసార్లు, నెహ్రూ మూడుసార్లు, రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) రెండుసార్లు, పీవీ నరసింహారావు ఒకసారి ప్రసంగించారు. మోదీ అమెరికా పార్లమెంటులో రెండుసార్లు మాట్లాడారు.