Bhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
విజయనగరం జిల్లా భోగాపురం (Bhogapuram)లో విమానయాన విశ్వవిద్యాలయం (Aviation University) ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై విశాఖ (Visakhapatnam) లో జరిగే పారిశ్రామిక సదస్సులో సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు (Rammohan Naidu) వెల్లడిరచారు. విమానాశ్రయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, డిసెంబరులో ఫ్లైట్ టెస్ట్ (Flight test) ఉంటుందని ప్రకటించారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక జనవరి నాటికే విమానాలు ఎగురుతాయని తెలిపారు. దీంతో ఆర్థిక, వాణిజ్య రంగాలకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారనుందన్నారు.







