Sundar Pichai : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi )తో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) భేటీ అయ్యారు. పారిస్ (Paris)లో జరుగుతున్న ఏఐ ( కృత్రిమ మేధ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమైన వీరు భారత్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వినియోగానికి, అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. భారత్లో డిజిటల్ మార్పులు తీసుకొచ్చేందుకు గూగుల్(Google), ప్రభుత్వం ఎలా పనిచేయొచ్చో కూడా ప్రధానితో మాట్లాడినట్లు పిచాయ్ పేర్కొన్నారు. ఏఐ(AI)లో భారత్ వేగంగా అడుగులు వేస్తోందని, దేశంలో యువశక్తి అధికంగా ఉందని, భారీగా పెట్టుబడులు పెట్టాలని మోదీ అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు.






