Modi: ప్రధాని మోదీని ఆహ్వానించిన డొనాల్డ్ ట్రంప్?

ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో గాజా (Gaza) శాంతి ఒప్పందం జరగనుంది. ఈ శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆహ్వానించినట్లు తెలిసింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు తెలిసింది. అమెరికా -భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా (Visa) ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందడం గమనార్హం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.