ఎట్టకేలకు 25ఏళ్ల తర్వాత పాక్ అంగీకారం
ఇన్నాళ్లూ కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం లేదని వాదిస్తూ వచ్చిన పాకిస్థాన్ ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత నిజాన్ని అంగీకరించింది. ఇన్నాళ్లు తర్వాత ఆ దేశ సైన్యాధిపతే తమ పాత్రను ధ్రువీకరించారు. పాకిస్థాన్లోని రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయంలో డిఫెన్స్ డే జరిగింది. ఇందులో సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేల మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. దీంతో కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం తమ పాత్ర అంగీకరించినట్లైంది. 1999 మే `జులై మధ్య భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.






