America : 23 నెలల్లో 92 లక్షల మంది!
డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పరిధిలోని యూఎస్ బోర్డర్ అండ్ కస్టమ్స్ పెట్రోల్ (యూఎస్బీపీ), యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) గణాంకాల ప్రకారం 2022 డిసెంబరు (December) నుంచి 2024 అక్టోబరు(October) మధ్య 23 నెలల వ్యవధిలో 92 లక్షల మందికి పైగా అమెరికా (America )లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో సరిహద్దుల్లో అరెస్టయినవారు, బహిష్కరణకు గురైనవారు, ప్రవేశానికి అనుమతి నిరాకరించిన వారు ఉన్నారు. 2021 నుంచి 2024 వరకూ మొత్తం 3,488 మంది భారతీయుల(Indians)ను ఐసీపీ (ICP)అరెస్టు చేసింది. మరోవైపు 2022 డిసెంబరు నుంచి 2024 వరకు మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 2,69,884 మంది భారతీయలను యూఎస్బీపీ (USBP) అడ్డుకుంది.






