Donald Trump: డొనాల్డ్ ట్రంప్ బాటలోనే యూకే
అధికారంలోకి వచ్చీరాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). తాజాగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కూడా ట్రంప్ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్టు చేసింది. దీనిపై తాజాగా దేశ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) కూడా స్పందించారు. అక్రమ వలసలకు ముగింపు పలుకుతామన్నారు. యూకే (UK)లో అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ చట్టవ్యతిరేక వలసలను ముగిస్తాం అని ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. వాస్తవానికి గతేడాది జులైలో బ్రిటన్లో లేబర్ పార్టీ (Labor Party) అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.






