Canada : స్టార్‌లింక్ డీల్ రద్దు : కెనడా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా అందరిపైనా సుంకాల మోత మోగిస్తున్నారు. కెనడా (Canada)పైనా 25 శాతం విధించారు. దీంతో ఆ దేశం నుంచి స్పందన వచ్చింది. ఆంటారియా అధినేత డగ్ఫోర్డ్ (Dugford) అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. మస్క్ (Musk) నేతృత్వంలోని స్టార్‌లింక్‌తో ఉన్న 100 మిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారు ఆంటారియోను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. చిరునవ్వుతోనే చేయాల్సిందంతా చేస్తా. కరెంట్ కోతలు విధిస్తా. ఆంటారియోతో స్టార్‌లింక్ (Starlink) కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నా. అది పూర్తయింది అని డగ్ఫోర్డ్ వెల్లడిరచారు.






